ఛత్తీస్ గఢ్ లోని మహేంద్రగఢ్ జిల్లాలో………. దారుణం జరిగింంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సును కట్టేసి..నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నలుగురిలో ఒక మైనర్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో ఆస్పత్రిలో నర్సు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు….ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఎవరికైనా చెబితే…. హత్య చేస్తామని బెదిరించారని వివరించారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదుచేసిన పోలీసులు మైనర్ సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డాయి. తమకు రక్షణ కల్పించాలని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే విధులు బహిష్కరిస్తామని…మహేంద్రగఢ్ జిల్లా చీఫ్ హెల్త్ ఆఫీసర్ ప్రతిమా సింగ్ అన్నారు.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
——————————————————————————————————
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
——————————————————————————————————
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News – https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
——————————————————————————————————-
source